🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 9:22 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

కోర్టుకు హాజరు గాని ఇద్దరు వ్యక్తులను జైలుకు తరలింపు

News Image
ముఖ్యమైన పాయింట్స్:నా దగ్గర రికమండేషన్లు కుదరవు ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి కోర్టుకు హాజరు కాని ఇద్దరు వ్యక్తులను జైలుకు తరలించిన ఎస్సై వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు ఎవరైనా సరే చట్టం ముందు తప్పించుకునే ప్రయత్నం చేసిన లీడర్ల సర్పంచులు చెప్పి రికమెంటేషన్తో తప్పించుకుంటే వదిలే ప్రసక్తి లేదు నా దగ్గర ఎలాంటి రికమండేషన్లు పనికిరావు జాగ్రత్త ఉండాలి ఇప్పటికైనా ఎవరు తప్పించుకున్న మీరంతా మీరే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవాలి లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అన్నారు ఈరోజు కోర్టుకు తరలించిన వారి వివరాలు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన 1) వేముల సుధాకర్ తండ్రి రాములు, వయసు 26 సంవత్సరాలు 2) తాటిపాముల పరశురాములు తండ్రి సోమయ్య వయసు 27 సంవత్సరాలు అను వ్యక్తులు గత కొంతకాలంగా కోర్టుకు హాజరుకానందున, వీరి మీద తుంగతుర్తి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారి అయినది, వారిని ఈరోజు వారి గ్రామంలో అదుపులో తీసుకొని తుంగతుర్తి కోర్టు లో హాజరు పరచగా వారిని తుంగతుర్తి జడ్జిగారు గౌస్ పాష , సూర్యాపేట సబ్ జైలు కు తరలించారు
🏠 Home