🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 7:52 pm Posted by : Telangana Vaartha

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

News Image
ఈ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చిన ఘనత కెసిఆర్ దే..
బతుకమ్మ, దేవీ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి..
ప్రజలందరికీ బతుకమ్మ, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..
మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడా లేనివిదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపునిచ్చి అధికారికంగా నిర్వహింకునేలా చేసిన ఘనత ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆనాటి నుంచే బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. ఎంగిలి పువ్వు తో ప్రారంభమయ్యే బతుకమ్మ, దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home