🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 2:47 am Posted by : Telangana Vaartha

మార్కెట్ కమిటీ చైర్మన్‌గా స్పందనరాజీవ్ నియామకం..

News Image
ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో బాధ్యతలు..
రాజీవ్‌కు పలువురి అభినందనలు..
నూతన బాధ్యతలపై హర్షం..
రైతులు, వ్యాపారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్ష..
నేరేడుచర్ల మార్కెట్ కమిటీ అభివృద్ధిపై ఆశాభావం..
నేరేడుచర్ల: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చలసాని స్పందన రాజీవ్ నియమితులయ్యారు.భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆయనకు ఈ బాధ్యతలు దక్కాయని పేర్కొంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న చలసాని స్పందన రాజీవ్‌కు పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ పరిధిలో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారు నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోరారు. చైర్మన్‌గా ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ పలువురు అభినందనలు తెలిపారు.
🏠 Home