తిరుమలగిరి 09 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధించడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పట్టణంలో రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మండల పార్టీ అధ్యక్షుడు & మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడి నిర్వహించిన ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం... తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ద్వారా అందించిన నీళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు పంటలు అన్ని పొట్ట దశలో ఉన్నయని,,. ఈ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తే పంటలు గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ విద్యుత్ సరఫరా చేయడం లేదు. దీంతో పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి అని అన్నారు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంట పొలాలు, నెర్రలు వారిన నేలలు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయని అన్నారు.. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదు యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేయాలి’ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే ఉత్పత్తి చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆరోపించారు సాగునీరు, విద్యుత్ కొరతతో వ్యవసాయ రంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజా క్షేత్రంలో శిక్షిస్తాం 50 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ రేవంత్‌రెడ్డిని వదిలేది లేదని అన్ని కక్కిస్తాం అని అన్నారు.. రేవంత్ రెడ్డి చరిత్ర హిణుడిగా మిగలడం ఖాయం అని రైతుల ఉసురుతో ప్రభుత్వం నాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్స్ , గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు