🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 08 October 2026, 7:39 pm Posted by : Telangana Vaartha

అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం

News Image
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలో చాగాపురం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ హేమలత, సూపర్వైజర్ బాలమ్మ, వారి ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏడు నెలల చిన్నారులకుఅన్న ప్రాసన కార్యక్రమం సిడిపిఓ హేమలత చేతులమీదుగా నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలకు బరువులు తీయడం జరిగింది. సిడిపిఓ హేమలత మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ప్రతినెల అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టిక ఆరాహాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సూచించారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే శిశువులు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు గుడ్లు ఆకుకూరలు పౌష్టికాహారం వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. తల్లులు తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని గర్భిణీ స్త్రీలు ప్రసవించిన వెంటనే ముర్రుపాలు పుట్టిన బిడ్డకు త్రాగించాలని చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సిడిపిఓ హేమలత సూచించారు. ప్రభుత్వము అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఉమా, భాగ్యమ్మ,చంద్రకళ, రాఘవేంద్రమ్మ,ఆశ వర్కర్ హేమలతగర్భిణీ బాలింతలు పిల్లల తల్లులు ఉన్నారు.
🏠 Home