దివ్య క్షేత్రం భద్రాద్రిలో మహాలయ పితృపక్షాల సందర్భంగా
తెలంగాణ వార్త అక్టోబర్ 8 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. : భాద్రపద బహుళంలో పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ పక్షాలు (పితృపక్షాలు)సెప్టెంబర్ 27వతేదీ భాద్రపద బహుళ పాడ్యమి ఆదివారం నుండి భాద్రపద అమావాస్య (మహాలయ (పెద్దల) అమావాస్య అక్టోబర్ 10 శనివారం వరకు మహాలయ పితృపక్షాలు జరుగుతాయి. ఈ పితృపక్షాలలో స్వర్గస్తులైన మాతా పిత్రులకు, తమ వంశంలోని స్వర్గస్తులైన ఇతర పెద్దలకు తమ ఇండ్ల వద్ద, పవిత్ర నదీ తీరాల వద్ద పితృదేవతలను పూజించి వారికి పిండ ప్రధానాలు ఆచరించడం హైందవ సంస్కృతిలో కృతయుగం నుండి వస్తున్న మన సాంప్రదాయం. దీనిలో భాగంగా పితృమూర్తి పుణ్యక్షేత్రమైన భద్రాచలం దివ్య క్షేత్రంలో దక్షిణముఖంగా ప్రవహిస్తున్న పుణ్య గోదావరి నదిలో తమ పితృదేవతలకు భక్తులు పిండ ప్రదానాలు ఆచరిస్తుంటారు. పితృపక్ష పుణ్య దినములు కావడంతో స్వర్గస్తులైన తమ తల్లితండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు పిండప్రదానాలు చేసుకున్నవారు పితృదేవతల ఆశీస్సులను కోరుతూ అన్నదానాలు చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా కుమారి సోమరాజు ప్రణతి, గుంటూరి. రమ,రాజశేఖర్, వినోద్, మొదలగు వారి సహాయంతో మహాలయ పితృపక్షాలలో తమ ఇంటి వద్ద గురువారం అన్నదానం నిర్వహించినట్లు రామా వజ్జల
రవికుమార్ దంపతులు తెలిపారు. అక్టోబర్ 9 మరియు 10 వ తేదీలలో ముగుస్తున్న పితృపక్షాలలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ పితృదేవతలకు మహాలయ శ్రద్ధాలు ఆచరించి పితృదేవతల దీవెనలు పొందాలని పురోహితులు తెలిపారు.