అడ్డగూడూరు 8 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిన్నపడిశాల గ్రామానికి చెందిన గొర్ల లింగయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.ఆయన భార్య యాదలక్ష్మి కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి కుమారుడు మధు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మధు పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి,తమ వంతుగా విరాళాలు సేకరించారు.సేకరించిన రూ.41వేల రూపాయలను యాదలక్ష్మి దశదినకర్మ సందర్భంగా గ్రామ పెద్దల చేతుల మీదుగా మధుకు ఆర్థిక సహాయంగా అందజేశారు.కష్టకాలంలో ఉన్న మధుకు అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ సభ్యులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు. మనలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనమంతా ఒకరి కొకరం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం చేపట్టినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి సులోచన, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, గ్రామస్తులు తీగల సికిందర్ రెడ్డి, అంబటి రమేష్ గౌడ్, అంబటి అనిల్ గౌడ్, ఓర్సు నవీన్, సంజీవ్, నరేష్, కృష్ణారెడ్డి,ఉమేష్, అఖిల్, ప్రభు, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.