🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 7:47 pm Posted by : Telangana Vaartha

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

News Image
DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే వార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 2024 జనవరి మరియు 2024 జులై నెలలకు సంబంధించిన రెండు డీఏలను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు డీఏలు కలిపి ఉద్యోగుల వేతనంలో 6.27 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రాబోయే అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ పెరిగిన డీఏలను ఉద్యోగులకు చెల్లించనున్నారు. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతాలో జమ చేయనున్నారు. ఇక సీపీఎస్ (CPS) ఉద్యోగులకు సంబంధించి మొదటి డీఏను 33 వాయిదాలలో, రెండో డీఏను 27 వాయిదాలలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
🏠 Home