రవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి గారి సూచనల మేరకు, కోదాడ డిఎస్పి శ్రీనివాస రెడ్డి గారి అధ్వర్యంలో షి టీమ్ సిబ్బంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ షి టీమ్ ఎస్ఐ మల్లేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి, బెట్టింగ్ యాప్ లు, ఆన్లైన్ గేమింగ్ యాప్ ల మాయలో పడి తమ భవిష్యత్తు ను పాడు చేసుకోవద్దని సూచించడం జరిగింది. లోన్ యాప్ ల ఉచ్చు లో పడి తమ ప్రాణాలు తీసుకోవద్దని కోరినారు. యువత గంజాయి మత్తులో పడి, దానికి బానిస అయి తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారని తెలియజేశారు. మేసేజ్ ల రూపంలో గాని, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం గానీ, ఫోన్ లు చేసి గాని, మహిళల ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలకు పాల్పడిన కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల గురించి, షి టీమ్ గురించి, సైబర్ నేరాల గురించి, షి టీమ్ ను సంప్రదించడం ఎలా అనే విషయం గురించి, అత్యవసర సమయాల్లో చేయవలసిన 100 డయల్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతా భాయ్ గారు, షి టీమ్ మహిళా కానిస్టేబుళ్ళు సాయి జ్యోతి, సౌజన్య, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.