🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 7:35 pm Posted by : A.Timma Gurudu

ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి” పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

News Image
Bhadradri Kothagudem:- భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) సూచనల మేరకు అక్టోబర్‌ 2026ను జాతీయ సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “పాజ్ ఫర్ సేఫ్టీ – పాజ్. థింక్. వెరిఫై…” అనే నినాదంతో సైబర్‌ భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో “ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి” అనే సైబర్‌ భద్రతా అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆవిష్కరించారు. సైబర్‌ జాగరూకత దివస్‌”*లో భాగంగా ప్రజలకు సైబర్‌ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రధానంగా పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఫ్రాడ్‌లు, లోన్‌ యాప్‌ మోసాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు తదితర సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అక్టోబర్‌ నెలంతా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, కమ్యూనిటీలు, ఆర్‌డబ్ల్యూఏలు, మతపరమైన ప్రదేశాలు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో సైబర్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే దసరా, బతుకమ్మ వేడుకలు, ఇతర ప్రజా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో ప్రజలకు సైబర్‌ భద్రతా సూచనలు అందించనున్నారు. అవగాహన ర్యాలీలు, వాక్స్‌, సైకిల్‌ ర్యాలీలు, వీధి నాటకాలు, స్కిట్లు, పోస్టర్‌ ప్రదర్శనలు, క్విజ్‌లు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, సోషల్‌ మీడియా ప్రచారాలు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్‌ నెల 30 లేదా 31వ తేదీన జిల్లా స్థాయిలో “సైబర్ ఫ్లాష్ వాక్” నిర్వహించి నెల రోజుల సైబర్‌ అవగాహన కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారు.ప్రజలు సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కాల్‌, మెసేజ్‌, లింక్‌ లేదా ఆన్‌లైన్‌ లావాదేవీ ఎదురైనప్పుడు వెంటనే స్పందించకుండా “ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి” అనే సందేశాన్ని గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ నరేష్, భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, ఎస్సై జుబేదాబేగం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home