🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 7:13 pm Posted by : Telangana Vaartha

రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టైర్లు దగ్ధం చేసి భారీ నిరసన

News Image
కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను అరెస్టు చేసి ఓటు చోరీ పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరికొందని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యలా సూచనలతో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు జావేద్ బేగ్ ఆధ్వర్యంలో టైర్లు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్న నాడు ఎవరు పట్టించుకోలేదని నేడు సిఇసి జ్ఞానేశ్ కుమార్ ఆలంబిస్తున్న తీరుతో తేటతెల్లమైందని అన్నారు. కమిషన్లోని మిగతా ఇద్దరు సభ్యుల తీర్మానం లేకుండా జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా అధికార బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గాల ఓట్లను తొలగించేందుకు భారీ కుట్రను చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జ్ఞానేశ్ కుమార్ ను విధుల నుండి తొలగించి అరెస్టు చేసి ఓటు చోరీపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బైరు వెంకన్న గౌడ్, అంజద్ అలీ , జిల్లా కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు నాగుల వాసు, భానుతు సైదులు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కినపల్లి జానయ్య,గడ్డం వెంకన్న,ఇశ్రార్ అహ్మద్,రుద్రంగి రవి, నరేందర్ నాయుడు, సాయి నేత,దంతాల సాయి నవీన్, సాజిత్ ఖాన్ (నీడ్స్ ),గుణగంటి సైదులు యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కోర్డినేటర్ బాణాల పవన్, కోకోర్డినేటర్ వినయ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనిల్ మల్లేపక, దంతలా నవీన్, యూత్ కాంగ్రెస్ మండల్ ఉపాధ్యక్షులు కప్పల మహేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, రఫీ, ఆదిల్ భార్గవ్, శివ,భారత్, అభి, అనిల్, సుహాస్, మహేష్ ,పండు,రమేష్, శేకర్, చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు
🏠 Home