రావన్నపేట 7 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ నెల అక్టోబర్ 8న ఆర్టిసి బస్సు భవన్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హాజరై వారు ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టిసి బస్సులలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 34 నెలలు పూర్తి అవుతున్న హామిని అమలు చేయలేదని అన్నారు.ఇప్పటికే మహిళా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉందని కేవలం పురుషులకు మాత్రమే అమలు చేయాల్సి ఉందని అన్నారు.జిల్లా స్థాయిలో డీలక్స్ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతిస్తున్నారని,గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే ఎక్ష్ప్రెస్స్,డీలక్స్ బస్సుల్లో మాత్రం వికలాంగుల పాసులను అనుమతించడం లేదని అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డినరీ బస్సుల తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని అలాంటప్పుడు వికలాంగులకు ఎలా ఉపయోగపడుతుందని అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కోసం 34 నెలల నుండి వికలాంగులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఆర్టిసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని,గ్రేటర్ హైదరాబాద్ లో నడిచే అన్ని రకాల ఆర్టిసి బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని అక్టోబర్ 8న హైదరాబాద్ లోని బస్సు భవన్ ముందు జరిగే ధర్నాలో వికలాంగుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగు నరసింహ అధ్యక్షులు ఒంపు వెంకటేశం ఉపాధ్యక్షులు నూకల వెంకటేశం మరో ఉపాధ్యక్షులు ఆది నారాయణ ఆదినారాయణ చారి ప్రధాన కార్యదర్శి పెండల శేఖర్ సహాయ కార్యదర్శి గర్దాస్ రవి మరో సహాయక కార్యదర్శిరాలు పగడాల లక్ష్మి కోశాధికారి గోకికారి నర్సోజి కమిటీ సభలు శివగల రాములు గర్దాసు నరహరి రాచకొండ శ్రీకాంత్ పగడాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.