చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు సబ్బండ జాతులు తరలి రావాలి
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షులు ముద్దంగుల యాదగిరి, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేసి దొరలకు ఎదురెొడ్డిన పోరాట వీరణారీ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో జరగబోయే చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబండ జాతి ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రం ఇసునూరు దూరలను ఎదిరించి దొరల అరాచకాలను సహించలేక పోరాటం చేసిన సాకలి ఐలమ్మ చరిత్ర పుటాల్లో నిలిచిపోయిందని ఆయన గుర్తు చేశారు, ఈనెల చివరలో పోరాటం చేసిన వీర నారీమణి సాకలి ఐలమ్మ విగ్ర ఆవిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.