🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 8:08 pm Posted by : Telangana Vaartha

శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆస్తులు కాపాడండి

News Image
తెలంగాణ వార్త అక్టోబర్6 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.
సుమారు 100 సంవత్సరాలకు పూర్వం హరినాథ్ బాబా భక్తులు పోలిశెట్టి రామదాసు గారు భద్రాచలంలో అనేక వ్య యప్రయాసల కు ఓర్చి కుసుమహర్నాద్ బాబా దేవాలయం నిర్మించారు. ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు 300 ఎకరాలకు పైగా విలువైన భూములు ఉన్నాయి. భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ ఆఫీస్ సమీపంలో సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటి స్థలాలు ఆక్రమణకు గురయినాయి. ఈ ఆక్రమణ విషయంలో జరిగిన వివాదాలు ఉన్నత న్యాయస్థానాల దృష్టికి వెళ్లడం జరిగింది. న్యాయస్థానా ల లోకుసుమ హరినాథ్ బాబా దేవాలయానికి అనుకూలంగా తీర్పులు రావడం కూడా జరిగింది. అలాగే భద్రాచలం పట్టణంలో డాక్టర్ సుబ్బరాజు ఆసుపత్రి సమీపంలో సుమారు ఒక కోటి రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం హరినాథ్ బాబా దేవస్థానం నకు ఉన్నది.
ఈ స్థలం వద్ద గతంలో ట్రస్ట్ బోర్డు వారు ఆక్రమణకు గురి కాకుండా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టించడం జరిగింది. ఈ కారణంగా ఈ విలువైన భూమి దేవస్థానం స్వాధీనంలోనే ఉన్నది. ఈమధ్య దేవాలయఅధికారుల అశ్రద్ధ మరియు ఆమ్యామ్యాల ఆశతో సుమారు 7 సెంట్ల విలువైన ఈ స్థలం ఆక్రమణకు గురి అయినది.
ఆక్రమణ చేసిన వా రే విలువైన ఈ స్థలం బాబా గారికి చెందిన దే అని, ఇంతకాలం మేము కాపాడుతున్నందునఈ స్థలం విక్రయించేటట్లయితే మాకే విక్రయించాలని బాబా గారి స్థలాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్న వారే తమ స్వదుస్తూ రితో గతంలోనే దేవస్థానం వారికి లేక కూడా ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విలువైన దేవస్థానం భూమి అన్యాక్రాంతం అవుతుంటే మీనమేషాలు లెక్కిస్తూ విలువైన స్థలాన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు.
అలాగే బస్టాండ్ వెనుక పిల్లల పార్కు సమీపంలో కు సుమ హరినాథ్ బాబా దేవస్థానానికి విలువైన భూములు అన్యాక్రాంతమైఉన్నాయి. ఈవిషయంలో స్థానిక సబ్ కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని విలువైన ఏడు 7 సెం ట్ల స్థలాన్ని, ఐటీడీఏ ఆఫీసుకు సమీపంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
🏠 Home