🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 7:57 pm Posted by : Telangana Vaartha

భద్రాచలం రామాలయం ఫేక్ ఉద్యోగులతో రోడ్డున పడుతున్న వైనం

News Image
ఘటన మరువక ముందే మరొక ఘటన.
ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించిన వ్యక్తి ఎవరు?
భద్రాచలం రామాలయం నీ ఎంత పుణ్యక్షేత్రంగా భావించే ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం సంపాదించిన వారికే ప్రమోషన్లు.
కోర్టులో విచారణ చేస్తున్నప్పటికీ ఎలా ప్రమోషన్ ఇచ్చారు. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. యూనివర్సిటీలో చదివేనని చెబుతున్న అధికారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. గుర్తింపు ఉన్న లేకున్నా యూనివర్సిటీలో చదువుకోకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు తయారుచేసి ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తిపై క్రిమినల్ విద్యాశాఖ చట్టాలు పెట్టాలి. ఇంత జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు . ఒకే దగ్గర నాలుగు సంవత్సరాలు చెయ్యకూడదు అని నిబంధనలు ఉన్నా ఏళ్ల తరబడి ఉన్న అధికారులను ఎందుకు మరో ప్రాంతానికి పంపడం లేదు. భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయాన్ని కాపాడాలి ఫేక్ సర్టిఫికెట్లన్నీ గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ ఉంటుంది. PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్
🏠 Home