🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 7:47 pm Posted by : Telangana Vaartha

మాన్ దొడ్డి ఉపసర్పంచ్ చెక్కు పవర్ నిలిపివేత

News Image
గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లులపై (చెక్కులపై) సంతకాలు చేయడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ భీమన్న చెక్ పవర్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప సర్పంచ్ పై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 12న డిఎల్పిఓ గ్రామపంచాయతీలో విచారణ నిమిత్తం రాగా ఉప సర్పంచ్ హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపసర్పంచ్ భీమన్న గ్రామపంచాయతీ పనులకు సంబంధించిన సంయుక్త సంతకం చేసే అధికారాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రాజోలి ఎంపీడీవోకు చెక్ పవర్ కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా డిపిఓ పేర్కొన్నారు.

🏠 Home