🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 7:28 pm Posted by : Telangana Vaartha

ప్రభుత్వ పాఠశాలలతోపాటు అంగన్వాడీ టీచర్స్ హెలర్స్ కు దసరా సెలవులు ఇవ్వాలి

News Image
సూర్యాపేట : అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు దసరా సెలవులు 14 రోజులు ఇవ్వాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి. గురూజీ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ రోజు DWO కార్యాలయ సూపరింటెండెంట్ హుస్సేన్ కు మెమోరాండం అందజేశారు. అనంతరం గురూజీ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రo లోనే అతి పెద్ద పండుగ దసరా ను ప్రజలoతా జరుపుకుంటున్న పరిస్థితి ఉందని అందుకే 14 రోజులు సెలవులు ఇచ్చి THR అవకాశం ఇవ్వాలని అన్నారు. గత సంవత్సరం మాదిరి కాకుండా 14రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ ను పట్టణాలు, గ్రామాల్లో జరుపుకుంటారని బతుకమ్మ ను దృష్టిలో ఉంచుకొని సెలవు లు ఇవ్వాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలుతాటిపాముల. నాగలక్ష్మి, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి. సుజాత ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో యూనియన్ జిల్లా నాయకులు సోమగాని. రమణ, కలకోట.జ్యోతి, కారింగుల.సావిత్రి, పద్మ, నీలిమ తదితరులు పాల్గొన్నారు
🏠 Home