పాఠశాలలలో డీఈఓ అకాస్మిక తనిఖీలు తరగతి గది నుండి వంటగది వరకు క్షుణ్ణంగా పరిశీలన
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ధరూర్. మండల కేంద్రం లోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేజీబీవీలో పకడ్బందీ పరిశీలన ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన డీఈఓ విజయలక్ష్మి విద్యార్థినులు రాస్తున్న ఎస్ఏ-1 పరీక్షల తీరును పరిశీలించారు. అనంతరం స్టాక్ రూమ్ లోని ప్రతి వస్తువు నాణ్యత, గడువు తేదీలను స్వయంగా చెక్ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి భోజన నాణ్యత, మెనూ గురించి ఆరా తీశారు. బాలబడిలో చిన్నారులతో ముచ్చట్లు అనంతరం ఎంపీపీఎస్ ధరూర్ బాలబడి విభాగంలో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. ఆట వస్తువుల ద్వారా బోధన జరుగుతున్న తీరును అభినందించారు. తదుపరి శ్రీ లక్ష్మి కాన్సెప్ట్ స్కూల్ ను సందర్శించిన డీఈఓ పాఠశాల నిర్వహణ, క్రమశిక్షణ, విద్యార్థుల హాజరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు, యుడైస్ ప్లస్ లో నమోదైన సంఖ్యకు పొంతన ఉండటాన్ని పరిశీలించి అభినందించారు. పాఠశాల యాజమాన్యం పాటిస్తున్న పారదర్శక విధానాలను కొనియాడుతూ, ఫీజు వివరాల పట్టికను మరింత స్పష్టంగా ప్రదర్శిస్తే తల్లిదండ్రులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు. పాఠశాలలోని చక్కని వాతావరణం, విద్యా ప్రమాణాలు మిగతా పాఠశాలలకు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ప్రధానోపాధ్యాయులు యోగేందర్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు. హెడ్డింగ్స్ బాగుండాలి ఇందులో