🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 6:36 pm Posted by : Telangana Vaartha

ఏడు తరగతులకు ఒక్క ఉపాధ్యాయురాలు

News Image
డిప్టేషన్పై టీచర్ ను బదిలీ చేయడంతో విద్యార్థులకు విద్యాబోధనలో అందరి పరిస్థితి.
జోగులాంబ గద్వాల6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. జిల్లా పరిధిలోని సం గాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ఒక్క ఉపాధ్యాయురాలు బోధనలు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు నలుగురు ఉన్న ఇద్దరు డిప్టేషన్పై వేరే పాఠశాలకు వెళ్లడంతో ఉన్న ప్రధానోపాధ్యాయులు సమావేశాలు ఆఫీసు పనుల మీద వెళ్లడం వలన ఉన్న ఒక్క టీచరు ఏడు తరగతులకు విద్యాబోధనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ప్రత్యేక చొరవ తీసుకున్న విద్యా విద్యార్థులకు విద్యాబోధనలోసమస్యలు కొట్టుమిట్టుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలోనూ 45 మంది విద్యార్థులు బాలబాలికలకు ఏడు తరగతుల వరకు పాఠంశాలు బోధించాల్సిన దుస్థితి ఒకే ఉపాధ్యాయులకు ఏర్పడడంతో అన్ని మధ్యాహ్న భోజనము పాఠశాల పరిశుభ్రత విద్యార్థుల హాజరు పాఠంశాలు అన్ని ఒకే ఉపాధ్యాయులు చూసుకోవడం వలన ఆమెకు తలకు మించిన భారంగా మారిందని చెప్పవచ్చు. సక్రమంగా చదువులు సాగని దుస్థితి: సం గాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరత వలన విద్యార్థులకు చదువులు సక్రమంగా అందాన్ని పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లీషు తెలుగు మీడియం బోధనలు కొనసాగుతున్న అధ్యాపకులు లేనందువలన ఉన్న ఒకే ఉపాధ్యాయురాలు ఏడు తరగతుల వరకు 7 పాఠ్య పుస్తకాలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానోపాధ్యాయురాలు తరచూ సమావేశాలకు వెళ్లడం వలన ఉన్న ఒకే ఉపాధ్యాయులకు విద్యాబోధనలు విద్యార్థులకు చెప్పడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో. బోధనలు చేయాల్సిన ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారిగా లేకపోవడంతో విద్యార్థులు అల్లర్లతో రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ క్రమశిక్షణ లేకుండా బోధనలు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న నలుగురు ఉపాధ్యాయులు సక్రమంగా ఉంటే ఉత్తీర్ణత శాతం ఉపాధ్యాయుల విద్యా బోధనలు మెరుగుపడే అవకాశం ఉంది. కానీ ఉపాధ్యాయుల కొరత వలన ఇక్కడున్న ఉపాధ్యాయులను డిప్టేషన్ పై వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో ఇక్కడ సమస్య చదువు సాధన పరిస్థితి ఏర్పడింది. నాణ్యతలేని మధ్యాహ్న భోజనాలు. సం గా ల ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరమైన ఆహార పదార్థాలతో నాణ్యతమైన భోజనాలు విద్యార్థులకు పెట్టాల్సిన ఉన్నది. మంగళవారం నాడు ఆ పాఠశాలలో సాంబారు అన్నం వడ్డించడంతో విద్యార్థులు తృప్తికరంగా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉదయం పూట రాగిజామ ఇవ్వాల్సి ఉండగా పిండి అయిపోవడంతో రాగిజామ లేదు నాణ్యతమైన భోజనాలు లేకపోవడంతో కడుపులో కాల్చుకొని సదువులు చదువుకోలేక విద్యార్థులు జీవితాలు దుర్భరంగా మారే పరిస్థితిలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు. స్పందించి వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధనల సమస్యలు లేకుండా నాణ్యతమైన భోజనాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
🏠 Home