🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 6:34 pm Posted by : Telangana Vaartha

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు

News Image
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . తహసీల్దార్ కార్యాలయం నందు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఇటిక్యాల ఎమ్మార్వో కార్యాలయం లో ఎమ్మెల్సీ,గ్రాడ్యుయేషన్ ఆన్లైన్ అప్లై చేయడం జరుగుతుందని మండలంలోని ప్రజలకు ఎమ్మార్వో విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని . వచ్చే నెల ఆరు వరకు గడువుందన్నారు. ఓటర్ కార్డ్ ఆధార్ కార్డ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మార్వో విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు ఆంజనేయులు, ఇటిక్యాల రేషన్ డీలర్ యుగంధర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి బి రాజు, బీఎస్పీ పార్టీ నాయకులు రాంబాబు తదితరులు ఉన్నారు.
🏠 Home