జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి
- టీయుడబ్ల్యుజె హెచ్ 143 ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.
సూర్యాపేట, 5 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రబుత్వం దృష్టికి తీసుకుపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న జర్నలిస్టులు నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని టీయుడబ్ల్యుజె హెచ్- 143 జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్యయాదవ్ అన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్టుల హెల్త్ కార్డులను ప్రస్తుత ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా హెల్త్ కార్డులను కొనసాగించే పరిస్థితి లేక పోవడంతో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఆర్ధికంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులను పునరుద్దరించి క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యుజె హెచ్ 143 ఆద్వర్యంలో సోమవారం స్థానిక వాణిజ్యభవన్ సెంటర్లో లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులు వేసే ఉద్యమాన్ని చేపట్టి మాట్లాడారు. తక్షణమే పాలక ప్రబుత్వం జర్నలిస్టుల క్యాష్ లెస్ హెల్త్ కార్డులను పునరుద్దరించి నూతనంగా జర్నలిస్టులుగా వచ్చిన వారందరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకురాష్ట్ర వ్యాప్తంగా టీయూడబ్ల్యుజె హెచ్ 143 నాయకులు అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళుతామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రబుత్వాలను నిలబెట్టడంలో ప్రధాన భూమిక పోషించే జర్నలిస్టుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రబుత్వం స్పదించి క్యాష్ లెస్ హెల్త్ కార్డులను పునురుద్దరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో దశల వారీగా ఉద్యమాలను ఉదృతం చేసి ప్రభుత్వాలను, ప్రబుత్వ కార్యాకలాపాలను స్తంబింపజేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న అక్రిడేషన్లు తగ్గించి కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని 239 జీవో ప్రకారం చేసి అందరికి అక్రిడేషన కార్డులు ఇవ్వడంతో పాటు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అమలు చేసి ప్రబుత్వం జర్నలిస్టుల పక్షపాతిగా ఉండాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో మీడియా అకాడమీ ప్రతినిధులు చొరవ చూపాలని లేని పక్షంలో యూనియన్లకు అతీతంగా టీయుడబ్ల్యుజె హెచ్143 ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె హెచ్ 143 ప్రతినిధులు గుండా శ్రీనివాసగుప్తా, పెద్దింటి శ్యాంసుంధర్ రెడ్డి, చల్లా చంద్రశేఖర్, పాలవరపు శ్రీనివాస్, గునగంటి సురేష్, అమరగాని నాగేందర్, రాపర్తి మహేష్, గిరీష్ కుమార్ చర్లపల్లి, దేవరగట్ల సతీష్, చౌగాని నరేందర్, గుగులోతు వీరన్న, ఉట్కూరి రవిందర్, బంధు వీరయ్య, మడూరి బ్రహ్మచారి, బచ్చు పురుషోత్తం, జహంగీర్, బొజ్జ ఎడ్వర్డ్, వల్దాస్ ప్రవీణ్, నిదుర శ్రవణ్, శరత్, యాకయ్య, రామాచారి, దుర్గం బాలు, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.