కేంద్ర ఉపాధి హామీ పథకానికి కొత్త జాబ్ కార్డుల జారీ...!
జాబ్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్లు తప్పనిసరిగా నిండి ఉండాలి. దరఖాస్తు ఫారంను పూర్తి చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫొటోను జత చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును ఫారంను మీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి పరిశీలన అనంతరం మీ దరఖాస్తును మండల కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీడీవో దరఖాస్తును పరిశీలించి మీ అర్హతలను తనిఖీ చేస్తారు. అర్హతలు ఉంటే జాబ్ కార్డు జారీ చేస్తారు. అనంతరం మీకు ఈ జాబ్ కార్డును అందిస్తారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా జాబ్ కార్డు అందించాలని ప్రభుత్వం నిబంధనలు విధిస్తోంది.ప్రతి గ్రామం నుంచి రోజుకు 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. దీని వల్ల గ్రామీణులకు ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే కేంద్రం వీబీ జీరాంజీ పథకంలో అనేక మార్పులు చేసింది. పనిదినాలతో పాటు కనీస వేతనాన్ని కూడా పెంచింది. వారం రోజుల్లో డబ్బులు క్రెడిట్ చేసేలా కొత్త మార్గదర్శకాలు రూపొందింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ స్కీమ్ అమలు చేస్తోంది.