🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 7:43 pm Posted by : Telangana Vaartha

జల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి

News Image
వసతి గృహాలపై పర్యవేక్షణ చేయాలి.
శాఖల పనితీరు నివేదికలు అందజేయాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ఎల్ నినో వంటి పరిస్థితులను అధిగమించేందుకు జల సంరక్షణకు ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో డిస్టిక్ వాటర్, శానిటేషన్ మిషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విబిజి రాంజీ పథకంలో జల సంరక్షణ పనులను చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటికి ప్రాధాన్యత నివ్వడమే కాక రైతులకు కూడా మేలు జరిగేలా పంట కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రోత్సహిస్తుందన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, భవిష్యత్తు తరాలకు నీటి కొరత రానివ్వకుండా ముందు చూపుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని వసతిగృహాలు, గురుకులాలు, కస్తూరిబా, ఇతర పాఠశాలలతో పాటు ఆసుపత్రులను సంబంధిత శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు తరచు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిఎండిడికేవై కు సంబంధించి జిల్లాలో చేపట్టిన వివిధ పనులపై ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ అందజేస్తుండాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై కూడా నివేదికలను అందజేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home