ప్రజావాణికి నిర్లక్షంగా – ఆలస్యంగా వస్తున్న వివిధ శాఖల అధికారులు
ప్రజా వాణి ఫిర్యాదులు (00).
జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించాల్సి ఉండగా, కొందరు అధికారులు ప్రారంభ సమయానికి హాజరుకాకుండా ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్ణీత సమయానికి హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఇటిక్యాల మండల ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి,ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ ఓ, అనిల్, ఏవో రవికుమార్ ఏపీవో, ఇటిక్యాల వైద్య ఆరోగ్యఅధికారి డాక్టర్ రాధిక, ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలమ్మ, ఏవో రవికుమార్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎక్సేంజ్ హరి, ఎలక్ట్రికల్ శ్రీనివాస్, వెటర్నరీ మాసుమన్న, వెలుగు సిసి మౌలాలి, ఇరిగేషన్ ఏ ఈ హౌసింగ్ ఏఈ ప్రియాంక. తదితరులు ఉన్నారు.