🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 October 2026, 1:46 am Posted by : Telangana Vaartha

పోలీసు ఉద్యోగ ఆశావహులకు 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష.

News Image
జిల్లాలోని 4 పరీక్షా కేంద్రాల్లో హాజరైన 1220 మంది యువత.
సూర్యాపేట పట్టణంలో ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఎంపిక పరీక్ష సరళి పరిశీలించిన జిల్లా ఎస్పీ కె. నరసింహ.
సూర్యాపేట:- ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందించనున్న 45 రోజుల ఉచిత శిక్షణలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం ఎంపిక పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాల, కోదాడ కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, హుజూర్‌నగర్ గ్రీన్‌వుడ్ పాఠశాల, తిరుమలగిరి జిల్లా పరిషత్ పాఠశాలలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహ సందర్శించి, పరీక్ష సరళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ప్రత్యేక చొరవ, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 45 రోజుల ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తునట్ల తెలిపారు. ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా 1,600 మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా, ఈరోజు 1,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని పోలీసు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఎస్పీ వెంట అదనపు కలెక్టర్ ట్రైనీ ఐఏఎస్ అనుషా, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, డిప్యూటీ ఎమ్మార్వో పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
🏠 Home