🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 11:47 pm Posted by : Telangana Vaartha

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి

News Image
యుద్దం మానవ జాతి ని నాశనం చేస్తుంది
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్ పిలుపు....
suryapet:-యుద్దం వలన మానవాళికి అంతులేని నష్టం జరుగుతుందని యుద్ధం వలన ప్రాణహానితోపాటు భవిష్యత్ తరాలు తీవ్రంగా దెబ్బతింటాయని అఖిలభారత సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది కె.వి.ఎల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మాండపల్లి ప్రభాకర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా నాలుగో మహాసభలో పాల్గొని మాట్లాడుతూ వ్యక్తి ఆలోచన మూలంగానే శాంతి గాని యుద్ధం గాని వస్తాయని, చెడు ఆలోచన అనేది ప్రపంచాన్ని వేరు చేస్తుందని ఆయన అన్నారు. సామ్రాజ్యవాదం కాంక్షతో అమెరికా వంటి దేశాలు ప్రపంచంలోని చిన్నచిన్న దేశాలను ఆక్రమించాలని చూస్తున్నాయని, తమ వ్యాపార విస్తరణ కోసం యూరప్ దేశాలు కూడా అమెరికాకు వంత పాడుతున్నాయని ఆయన అన్నారు. ఇరాన్ పై యుద్ధం వలన ఇరాన్ లో వేలాది మంది క్షతగాత్రులవడం, చిన్నారులు చనిపోవడం, అంగ వికలాంగులు కావటం జరిగిందని అన్నారు ‌ ఆహార పదార్థాల కొరత అవసరమైన నిత్యవసర మందులు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధం మానవాళికి మంచిది కాదని ఆయన అన్నారు. సామ్రాజ్యవాదం నశించాలని, సామ్యవాదం వర్దిల్లాలని, యుద్ధం వద్దు శాంతి ముద్దు, ఉగ్రవాదం మతోన్మాదం వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మౌనంగా వుండే వారి వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదని మౌనంగా ఉండటం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని, ఆలోచన లేని వ్యక్తులతో సమాజం బాగుపడదని అన్నారు. శాంతియుతంగా జీవిద్దాం ప్రగతివైపు పయనిద్దామని వారు అన్నారు . ప్రతి ఒక్కరు కూడా అమెరిక యొక్క యుద్దకాంక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని, నిరుద్యోగం, నిరక్షరాస్యత, దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన అన్నారు. మహాసభకు ముందు జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మహాసభ అధ్యక్షులు తోగిటి మురళి, బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్ కుమార్, పుట్టపాక అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో డాక్టర్ సమత వై వెంకటేశ్వర్లు, మండారి డేవిడ్ కుమార్, గుడిపూడి వెంకటేశ్వరరావు, తలమల్ల హస్సేన్, నాతి సవేంద్ర కుమార్, బొమ్మిడి లక్ష్మీనారాయణ, అనంతుల మల్లేశ్వరి, బూర వెంకటేశ్వర్లు, గుగులోతు రాజారాం, ఖమ్మంపాటి రాము, దంతాల రాంబాబు, ఎడెల్లి శ్రీకాంత్, గొడ్డలి నరసయ్య, తాళ్లపల్లి సత్యనారాయణ, దూలం నగేష్, దికొండ శ్రీనివాస్, పొన్నం రమేష్, గాలి రామకృష్ణ, నాతి లీలావతి, భూపాల్ ,బత్తుల నరసయ్య సారెడ్డి వెంకటరెడ్డి, చిలక రాజు శ్రీను, దాయం ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home