ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, పిసిసి సోషల్ మీడియా కార్యదర్శి రామడుగు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.