🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 7:17 pm Posted by : Telangana Vaartha

బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు

News Image
జోగులాంబ గద్వాల 3 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఎర్రవల్లి మండలం. పవిత్ర కృష్ణానది తీరాన వెలసిన బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి భక్తులను అనుగ్రహిస్తూ వారి కోరికలు తీరుస్తూ ఇలవేల్పుగా నిలిచాడు. జాతీయ రహదారి 44 పై వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం పలువురు భక్తులతో నిత్యం కళకళలాడుతుంది. శనివారం సందర్భంగా స్వామివారికి భక్తులు మొక్కులు సమర్పించి భక్తిని చాటుకున్నారు. దేవాలయ ఈవో పురందరు కుమార్, అర్చకులు సందీప్ ఆధ్వర్యంలో భక్తులకు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించారు.
🏠 Home