🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 1:38 pm Posted by : A.Timma Gurudu

రోకలి బండతో భార్యను హతమార్చిన భర్త?

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఓబులోనిపల్లి గ్రామంలో దారుణ ఘటన.
జోగులాంబ గద్వాల 3 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ధరూర్‌ మండలం ఓబులోనిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ములమ్మ అనే మహిళను ఆమె భర్త గోపి రోకలి బండతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదమే ఘటనకు కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. జమ్ములమ్మ మృతికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
🏠 Home