🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 10:21 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

గాంధీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి

News Image
తిరుమలగిరి 03 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయం మార్కెట్ యార్డు గ్రామ పంచాయతీలు, ఇతర సంస్థల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని, ఆయన అనుసరించిన అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువల ను పలువురు గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన అహింసా మార్గం దేశ చరిత్రలో ప్రత్యేకమైనదని, సాధారణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎల్సోజు స్రవంతి నరేష్ పి ఎస్ సి ఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ రాపాక సోమేష్ డాక్టర్ కోటచలం జలగం రామచంద్రన్ గౌడ్ లయన్స్ క్లబ్ సభ్యులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home