🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 9:50 pm Posted by : జేరిపోతుల రాంకుమార్

ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

News Image
తిరుమలగిరి 03 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన ఎస్సై కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ నేపథ్యంలో, సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఎస్పీ నరసింహ ఐపీఎస్ చర్యలు చేపట్టడం జరుగుతుంది కావున తిరుమలగిరి మండలానికి సంబంధించిన నిరుద్యోగులు ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకోగలరు.ఈ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి తిరుమలగిరి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది ఎంపికైన అభ్యర్థులకు సుమారు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించబడుతుంది
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత విధానంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని హాజరు కావాలి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ వెంకటరెడ్డి సూచించారు.
🏠 Home