జై జవాన్ జై కిసాన్ సృష్టికర్త మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మహాత్మ గాంధీల జయంతి
తెలంగాణ వార్త అక్టోబర్ 2 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన భారతీయ వీర జవాన్లకు, దేశం కరువుతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కోట్లాదిమంది భారతీయులకు తమ కష్టంతో ఆకలి తీర్చిన రైతన్నలకు గుర్తింపుగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఇరువురి రుణం మనం తీర్చుకోవాలని ఎలుగెత్తి చాటిన భారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారికి తెలుగు ప్రజలందరి తరపున ఘన నివాళులు సమర్పిస్తున్నట్లు గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల రవికుమార్ తెలిపారు.
పంచాయతి వార్డు మెంబర్ సైతం తన వాహనంగా కారు మెయింటైన్ చేస్తున్న మనదేశంలో, భారత ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించిన లాల్ బహదూర్ శాస్త్రికి సొంత కారు లేకపోవడం మాజీ ప్రధాని శాస్త్రి గారి నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం దేశ సౌభాగ్యం కోసం నిరంతరం కృషిచేసిన త్యాగధనులు మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహనీయుని బాటలో నేటి యువతరం నడవాలని ప్రజలుకోరుతున్నారు.
అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీజీగారికి శ్రద్ధాంజలి ఘటి స్తున్నట్లు రవికుమార్ తెలిపారు.