🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 9:35 pm Posted by : Telangana Vaartha

కంచనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

News Image
అడ్డగూడూరు 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నూతన గ్రామశాఖ కమిటీగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా భాషబోయిన చంద్రయ్య,ఉపాధ్యక్షుడిగా లొడంగి సత్తయ్య,ప్రధాన కార్యదర్శిగా నూకల సోమేష్,కార్యదర్శిగా చెడే శ్రీనులను కోశాధికారిగా భాష బోయిన శేఖర్ యాదవ్ ను,ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ,గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు చెరుకు వెంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుకునూరు విష్ణువర్ధన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home