జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎంపీడీవో రమాదేవి . అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ...! మహాత్మా గాంధీ జాతిపితగా దేశ ప్రజలకు శాంతి, అహింస మార్గాలను చూపిన మహానాయకుడని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కార్యాలయం సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.