🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:13 pm Posted by : Telangana Vaartha

శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో ఘనంగా గాంధీ,

News Image
ముఖ్యమైన పాయింట్స్:శాస్త్రి జయంతి వేడుకలు...!
జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌లో మహాత్మా గాంధీ 157వ జయంతి మరియు భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ...! మహాత్మా గాంధీ జాతిపితగా దేశ ప్రజలకు శాంతి, అహింస మార్గాలను చూపిన మహా నాయకుడని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మహనీయుల త్యాగాలు, దేశభక్తి, నైతిక విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీ శివకుమార్, రాఘవేంద్ర, ప్రభాకర్, సునీత, వైజయంతి తదితర ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులు అర్పించారు.
🏠 Home