🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:11 pm Posted by : A.Timma Gurudu

గాంధీ–శాస్త్రి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

News Image
ముఖ్యమైన పాయింట్స్:సీనియర్ అసిస్టెంట్ మనోహర్
సత్యం, అహింస మార్గంలో గాంధీజీ.. జై జవాన్–జై కిసాన్‌తో శాస్త్రి
మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి: సీనియర్ అసిస్టెంట్ మనోహర్
జోగులాంబ గద్వాల 2 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-. జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ అసిస్టెంట్ మనోహర్, గాంధీజీ, చిత్రపటానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ మనోహర్, మాట్లాడుతూ.. సత్యం, అహింసను నమ్మి వాటినే ఆయుధాలుగా చేసుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. గాంధీజీ కలలుగన్న మాదకద్రవ్యాలు, మద్యపానం లేని సమాజం, మహిళలకు భద్రతతో కూడిన స్వేచ్ఛ, గ్రామీణాభివృద్ధి సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని సీనియర్ అసిస్టెంట్ మనోహర్ సూచించారు. అదేవిధంగా “జై జవాన్–జై కిసాన్” నినాదంతో దేశ రక్షణకు సైనికులు, దేశ ఆహార భద్రతకు రైతులు అందిస్తున్న సేవలను దేశానికి చాటిచెప్పారని అన్నారు. నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని నిత్య జీవితంలో ఆచరించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని సీనియర్ అసిస్టెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిపిఓలు యుగంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
🏠 Home