మహాత్మ గాంధీ వేషధారణలో అలరించిన చిన్నారులు
తిరుమలగిరి మున్సిపాలిటీ లోని నందపురం గ్రామంలో 9. వార్డు లో మహాత్మా గాంధీ జయంతి. సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు చిన్నారులు మహాత్మా గాంధీ వేషాధారణతో అలరించడం ఒక అద్భుతమైన సంప్రదాయం పిల్లలు బాపూజీ లాగా తెల్లటి ధోవతి, చేతిలో కర్ర, గుండ్రటి కళ్లద్దాలు ధరించి "జాతిపిత" రూపాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ స్వప్న మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలకు మహాత్మా గాంధీ ఆశయాలు, సత్యం, అహింస వంటి విలువలను పరిచయం చేయడానికి ఈ వేషధారణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్, సంజీవన్ ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...