🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 6:26 pm Posted by : Telangana Vaartha

పోషణ మాసం వారోత్సవాల్లో సామూహిక శ్రీమంతాలు

News Image
ఖమ్మం నగరంలోని ఖమ్మం అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ద్వారకానగర్, భురహాన్‌పురం సెక్టార్లలో పోషణ మాసం వారోత్సవాల్లో భాగంగా 20 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడీపీఓ భద్రమ్మ , మాజీ కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం , రాపర్తి శరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా గాజులు, చీర, సారె అందించి ఆశీర్వదించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఖమ్మంలో పోషణ మాసం వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, టీకాలు, మందులు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు చిన్నారుల్లో అంగవైకల్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని వారు పేర్కొన్నారు.
🏠 Home