🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 6:24 pm Posted by : Telangana Vaartha

అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు 26000/- వేల వేతనం ఇవ్వాలి.

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీ లకు దసరా సెలవులు ఇవ్వాలి
Suryapet Rural:- దురాజుపల్లి సెక్టార్ లో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి. గురూజీ,యూనియన్ జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల. నాగలక్ష్మి లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడు సంవత్సరాలు కావస్తున్న అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండ నిర్లక్ష్యం చేయడం మోస పూరిత విధానం అని అన్నారు. అధికారం లోకి వస్తే 26000/- వేతనం ఇస్తామని వాగ్దానం చేశారని, చేసిన వాగ్దానం గంగ లో కలిపారని అన్నారు.ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్స్ కు పిల్లలు లేకుండా, రాకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గుణపాఠం తప్పదని అన్నారు. ప్రభుత్వ పాఠశాల ల తో పాటు అంగన్వాడీ లకు దసరా సెలవులు ఇవ్వాలని అన్నారు.ప్రతి నెల సెంటర్ కు గ్యాస్ బిల్లు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచాలని, నాణ్యమైన ఫుడ్, గుడ్డు, కంది పప్పు, కారం, పసుపు సప్లై చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికయినా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 26000/- వేతనం పెంచాలని అన్నారు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు అయిదు లక్షలు ఆయా కు 3లక్షలు ఇవ్వాలని, రిటైర్ అయిన వారికి వేతనం లో సగం పెన్షన్ ఇవ్వాలని,అర్హులైన అంగన్వాడీ లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రిటైర్ అయిన వారి స్థానం లో వారి కుటుంబం లో ఒకరి కి ఉద్యోగం ఇవ్వాలని .సెంటర్ క్లబ్ చేయడం ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమం లోదురాజు పల్లి సెక్టార్ బాధ్యులు వెంకటరమణ , చంద్రకళ, వెంకటమ్మ,గురువమ్మ,కళావతి, సంధ్య,జ్యోతి పూలమ్మ, జానమ్మ, భద్రమ్మ లీలా, స్వప్న, రమాదేవి, దయామణి,విజయ, అంజమ్మ,వెంకమ్మ,, సరోజినీ, లక్ష్మి,జానమ్మ, కళమ్మ, స్వరాజ్యం, జానీ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home