మర్మాంగాలు కోసి దారుణ హత్య
నరసరావుపేట:- వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నరసరావుపేట పట్టణం పెద్దచెరువుకు చెందిన తాపీమేస్త్రి గాసి రాజేష్(35) అవివాహితుడు కావడంతో మద్యం తాగి ఎక్కడో ఒకచోట నిద్రిస్తుంటాడు. ఎప్పటిలాగే కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్‌లో నిద్రిస్తున్న అతనిని గుర్తుతెలియని వారు రాయితో మోది హతమార్చారు. కత్తెరతో మర్మాంగాలు కోసి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ క్లూస్‌టీంకు సమాచారం అందించారు.
ముమ్మరంగా దర్యాప్తు. మృతుడు రాజేష్ రాత్రి పది గంటల వరకు కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో కనిపించాడు. అయితే నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి కదలికలు ఒంటిగంట నుంచి రెండింటి వరకు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు క్రైం పార్టీ పోలీసులు గాలిస్తున్నారు.