🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 11:44 pm Posted by : Telangana Vaartha

నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో నారాయణ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

News Image
ఖమ్మం :- నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ – 2026లో నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అక్షర గోకుల, రుషిత, జైత్ర యాదవ్, కార్తీక్ నందన్, గోల్డ్ మెడల్ మరియు జ్ఞాన శ్రీ, రిషిత, భవిష్, విశాంత్, కృష్ణ సాయి, సత్య సందేశ్ సిల్వర్ మెడల్స్ సాధించారు . సెప్టెంబర్ 27న హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఏ.జి.ఆర్ గార్డెన్స్ భట్టుపల్లి వద్ద నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో వివిధ కరాటే విభాగాల్లో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. దేశవ్యాప్తంగా పాల్గొన్న క్రీడాకారుల మధ్య పోటీ పడి ఈ ఘనత సాధించడం పట్ల ఖమ్మం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన సహకారం అందిస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జీ నవీన్ కుమార్, కరాటే మాస్టర్ ఉపేందర్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home