🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 8:15 pm Posted by : Telangana Vaartha

రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో ఎర్రవల్లి శ్రీ సరస్వతి విద్యార్థిని ప్రతిభ

News Image
జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రంలోని: ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ (CBSE) కు చెందిన 9వ తరగతి IIT Advanced విద్యార్థిని ఎస్.మేధ శ్రీ రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ఫెస్టివల్–2026లో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

హైదరాబాద్‌లోని SCERT బ్లాక్‌లోని గోదావరి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ఫెస్టివల్–2026లో ఎస్.మేధ శ్రీ జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర స్థాయి వేదికపై సైన్స్ సెమినార్‌లో పాల్గొన్న ఆమెకు నిర్వాహకులు పాల్గొనిన ధ్రువీకరణ పత్రం (Participation Certificate) అందజేశారు.

సెమినార్‌లో ఉత్సాహంగా పాల్గొని, తన శాస్త్రీయ ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శించిన మేధశ్రీని SCERT డైరెక్టర్ శ్రీ జి. రమేష్ అభినందించారు. విద్యార్థినిలోని శాస్త్రీయ దృక్పథం, ఆత్మవిశ్వాసం, అంకితభావాన్ని పాఠశాల యాజమాన్యం ప్రశంసించింది.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీ శివకుమార్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఎస్.మేధ శ్రీ D/o S.మధుసూదన్ రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ, పాఠశాలకు మరియు జోగులాంబ గద్వాల జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌లో విద్యార్థిని పాల్గొని ప్రతిభను చాటడం పాఠశాలకు ఎంతో గర్వకారణమైన విషయమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
🏠 Home