జోగులాంబ గద్వాల 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మయి ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. అజ్గర్ అలీ గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగ తనిఖీ చేశారు. ఈ సందర్భంగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని OP- సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, మందుల వినియోగ వివరాలు, వివిధ రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మెరుగైన వైద్య సేవలు అందేల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, NCD- స్క్రీనింగ్, TB, లెప్రసీ తదితర సేవలను లక్ష్యాలకు అనుగుణంగ సమర్థవంతంగ అమలు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందేల క్షేత్రస్థాయి సిబ్బంది చురుకుగ పనిచేయాలని తెలిపారు. అలాగే ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో నవీకరించి, పెండింగ్లో ఉన్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండ, ప్రభుత్వ నిబంధనలు మరియు ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పనిసరిగ పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. జిల్లాలో ఆరోగ్య సూచికలను మెరుగుపరిచి, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో జిల్లాను ముందంజలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.