🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 8:09 pm Posted by : Telangana Vaartha

భూ సమస్యల శాశ్వత పరిష్కారమే రీసర్వే ప్రక్రియ లక్ష్యం

News Image
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెవెన్యూ, భూ రీసర్వే, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది ..
తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా ప్రజాపాలనలో సాధ్యం చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపే మార్గమని రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ...
ఈరోజు వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, భూముల సర్వే, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరై సమీక్షించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా భూముల రీ సర్వే ప్రక్రియపై తహసిల్దార్లు, సర్వేయర్లతో ఒక్కొక్కరిగా సమీక్షించి, పురోగతిపై ఆరా తీశారు. అదేవిధంగా సర్వే ప్రక్రియపై రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
*మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని, మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందని తెలిపారు. ఈ ప్రక్రియను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పారదర్శకంగా, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 కేటాయించడం జరిగింది రెండో విడత మూడో విడత నాలుగో విడత దశలవారీగా ప్రతి ఒక్కరికి నిరుపేదలైన అర్హులు ఉన్న పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఏర్పడాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి ఒక్కరు సొంతింటి కల నెరవేర్చుకోవాలని ప్రజా ప్రభుత్వం పరిపాలనలో దశలవారీగా కృషి చేయడం జరిగింది
మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయా జిల్లాల అధికారులు క్రమబద్ధమైన విధానంలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. ప్రతి నెలలో ఒక్కో మండలానికి ఒక రోజును కేటాయించి, ఆ మండలానికి సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించాలని తెలిపారు. సాధ్యమైనంతవరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు, అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ప్రజలు పంపించే అర్జీలను పరిశీలించి, వాటిపై సమీక్షలు నిర్వహిస్తూ పరిష్కార మార్గాలను చూపాలని సూచించారు.
మంత్రివర్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ భూముల రీసర్వే ద్వారా భూముల హద్దులు, యాజమాన్యానికి సంబంధించిన సమస్యలతో పాటు సాదా బైనామా వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రీసర్వేను పకడ్బందీగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. రీసర్వే కోసం ఆధునిక రోవర్లను అన్ని జిల్లాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం, నాణ్యతతో రీసర్వే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, నవంబర్ 15వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల పర్యవేక్షణకు పలు ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పూర్తిస్థాయిలో భర్తీ చేస్తేనే గృహాల నిర్మాణం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. దశలవారీగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గట్టు మండలంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపతయ్య, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ, అటవీ, దేవాదాయ, మాజీ మార్కెట్ ఛైర్మెన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజశేఖర్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్ తదితర శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home