🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 1:11 am Posted by : Telangana Vaartha

దేశ వ్యాప్తంగా జరిగే బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు సీఐటీయూ మద్దతు

News Image
ముఖ్యమైన పాయింట్స్:నెమ్మాది వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి
సూర్యాపేట టౌన్ :వారానికి ఐదు రోజులు పని విధానాన్ని అమలు చేయాలని పీ ఎల్ ఐ (ప్రోడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ) పధకం అమలులో ఏకపక్ష ధోరణి ని వ్యతిరేకి స్తూ 12వ, వేతన ఒప్పందం లోని మిగిలిన డిమాండ్ లను పరిష్కరించాలని సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో జరగనున్న మూడు రోజుల సమ్మె కు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలియ జేశారు. ఆదివారం నాడు సీఐటీయూ కార్యాలయం లో జరిగిన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నముకగా ఉన్న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని శరవేగంగా ప్రయివేట్ పరం చేసే ప్రయత్నలకు తోడు ఉద్యోగ, అధికారుల సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కి ఏక పక్ష నిర్ణయాలను అమలు చేయడం కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలపై గత 12 సవంత్సరాలుగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలు, పోరాటాలు చేస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదన్నారు. ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, 2023 లో ఐ బి ఏ -యూ ఎఫ్ బి యు ల మధ్య అంగీకారం కుదిరి మూడు సంవత్సరం అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు రాక పోవడం అన్యాయమన్నారు. బ్యాంక్ లాభాల ఆధారంగా ఉద్యోగులు, అధికారులకు ఐదు రోజులు, పది రోజులు, పదిహేను రోజుల చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని సుధీర్ఘ చర్చల అనంతరం ఒప్పందం కుదిరి సంవత్సరాలుగా అమలు అవుతున్న ఒప్పంధాన్ని భగ్నం చేయడం అన్యాయం అన్నారు. దేశం లో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య అనంతరాలు సృష్టిస్తూ నిరుద్యోగం పెంచుతూ ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేసే కుట్రలు చేస్తూ జీ రామ్ జీ పధకాన్ని తెచ్చిందన్నారు.రాష్ట్రాల మీద భారం పెట్టుతూ కేంద్రం తపించుకుంటుందని నెమ్మాది అన్నారు... కార్మిక లేబర్ కొడ్లు, విధ్యుత్ సవరణ చట్టం, రైతు నల్లా చట్టాలు తెచ్చి అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచింధన్నారు. గత 60 సంత్సరాలు గా బ్యాంకింగ్ రంగం లో అమలు లో దైపాక్షిక ఒప్పందాల విధానాన్ని విచ్చిన్నం చేస్తున్న చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేస్తున్న మూడు రోజుల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దత్తు తెలియ జెస్తున్నామని నెమ్మాది తెలిపారు..
🏠 Home