🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 1:02 am Posted by : Telangana Vaartha

న్యాయవాదుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి

News Image
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL)రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్

సూర్యాపేట న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ (bommagani prabhakar) డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో ఐ ఏ ఎల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన భద్రతకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యంగా వృత్తిలోకి కొత్తగా ప్రవేశిస్తున్న జూనియర్ న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వారికి నెలకు రూ.10 వేల స్టైఫెండ్ అందించాలని అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన దాడులు, బెదిరింపులు వంటి ఘటనలను వారు ఖండించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలు అయ్యే రక్షణ చట్టం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించిన చట్టపరమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర స్థాయిలో కూడా సమగ్ర చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధులకు ప్రభుత్వాలు తగిన నిధులు సమకూర్చి, వైద్యం, కుటుంబ సంక్షేమం, వృత్తి ప్రారంభ దశలో ఆర్థిక సహాయం వంటి అంశాల్లో భరోసా కల్పించాలని బొమ్మగాని ప్రభాకర్ కోరారు.
యువ న్యాయవాదులకు ఆర్థిక సహాయం కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా 2026లో ప్రస్తావించినప్పటికీ “న్యాయవాదుల రక్షణ–సంక్షేమానికి ప్రభుత్వాలు స్పష్టమైన విధానాన్ని రూపొందించి, వెంటనే అమలు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తొగిటి మురళి జిల్లాకు సంబంధించిన సభ్యత్వం సమీక్ష ను వివరించారు. జిల్లా అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కోర్టు భవనాలు నిర్మాణం పూర్తికాకుండా ఉన్న వాటిని తక్షణమే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొమ్మ గాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోగటి మురళి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
🏠 Home