వరద గోదావరి లో సైతం శాంతించమని కోరుతూ భద్రాద్రిలో సమర్పించిన గోదావరి హారతి
భద్రాద్రి బ్రాహ్మణ పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్
తెలంగాణ వార్త సెప్టెంబర్ 27 జిల్లా స్టాపర్.టెంపుల్ టౌన్ భద్రాచలం:- భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి భద్రపత బహుళ పాడ్యమి మహాలయ పితృపక్షాలు జరుగుతున్న పవిత్రమైన రోజులు కావడంతో గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పితృదేవతలకు హారతులు సమర్పించడం జరిగిందని పురోహితులు రామా వజ్జల రవికుమార్ అన్నారు.
ఆదివారం నాడు సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భద్రపద బహుళ పాడ్యమి మహాలయ పితృ పక్షాలు జరుగుతున్న పవిత్రమైన రోజులు రావడం ముఖ్యంగా మొదటి రోజు కావడం చాలా విశేషమైనదని ఆదివారం దివ్య క్షేత్రం భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కూడా చాలా విశిష్టమైనదని ఆయన అన్నారు. అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను మరియు భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పితృ పక్షాలకు సంబంధించిన విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, భక్తులచే సృ శింప చేసి న, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు. గోదావరి వరదలు తగ్గి రైతులకు ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలని గోదావరి మాతను పూజించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి రామా వజ్జల రవి కుమార్ దంపతులు, సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణ దంపతులు సమర్పించిన ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడం జరిగినదని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి భద్రాద్రి పురోహితుల సంఘం వారు అందించారని ఆయన అన్నారు. ఆదివారం నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో శ్రీ చక్రపీఠం ఉమామహేశ్వ రా చార్య ఖమ్మం వారు, పాల్గొన్నారు. పురోహితులు సత్యప్రసాద్ శర్మ రామాచార్యులు, తేజ శర్మ, చంద్ర శేఖర శర్మ విహెచ్పి నుండి తిరుపతిరావు, మరియు సత్యనారాయణరెడ్డి, శివ, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.