🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 11:02 pm Posted by : Telangana Vaartha

ఆరోగ్యం క్షీణించి శంభూలింగేశ్వర స్వామి ఆంబోతు మృతి

News Image
ముఖ్యమైన పాయింట్స్:గ్రామస్తులు ఘనంగా అంతిమ యాత్ర
అడ్డగూడూరు 27 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని చిత్తలూర్ గ్రామానికి చెందిన శంభూ లింగేశ్వర స్వామి పేరుమీద కొన్ని సంవత్సరాల క్రితం కోడె దూడను వదిలివేశారు.గత కొన్ని సంవత్సరాల నుండి అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో దేవునికోడె నివసిస్తూ ఉండేది..శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. శంభూస్వామి కోడెకు గ్రామపంచాయతీ పెద్దలు గ్రామపంచాయతీ నుండి గ్రామ చివర వరకు ప్రజలు శనివారం ఉదయం డప్పు చప్పుల్లతో, కోలాటం వేస్తూ.. ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించారు. తదనంతరం చిత్తలూరు శంభులింగేశ్వర గుడి పెద్దలకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కంబాల వీరయ్య, గ్రామ పెద్దలు రవీందర్ రావు, బొమ్మగాని లక్ష్మయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home