🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 8:23 pm Posted by : Telangana Vaartha

జానకిపురం అంగన్వాడి కేంద్రంలో పోషణ మహోత్సవం కార్యక్రమం

News Image
అడ్డగూడూరు 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని జానకిపురం గ్రామంలో శనివారం నాడు స్థానిక అంగన్వాడి కేంద్రంలో పోషణ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూపర్వైజర్ మధురమ్మ మాట్లాడుతూ..గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు తృణధాన్యాలు గుడ్లు,పండ్లు సభ పాలల్లో తీసుకున్నట్లయితే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుదలను ఉంటుందని ఆమె అన్నారు. అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారాన్ని ఎప్పటికప్పుడు తగిన మోతాదులో అందించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని సమపాళ్లలో అందించే కార్యక్రమమని దీనిద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నారుల పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పోషకాహారంపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ మధురిమ, గ్రామ సర్పంచ్ అనిత సమ్మయ్య, అంగన్వాడి టీచర్ యాట ఉపేంద్ర, ఆశా కార్యకర్త లక్ష్మీ, ఆయా కళ్లమ్మతో పాటు విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home