🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 8:20 pm Posted by : A.Timma Gurudu

విద్యార్థిని అభినందించిన జిల్లా కలెక్టర్

News Image
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల వీరనారిచాకలి ఐలమ్మ 131 వ జయంతిని పురస్కరించుకుని ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో అమరవాయిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలవిద్యార్థిని జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి,జిల్లా రజక సంఘం అధ్యక్ష, కార్యదర్శులచే ఈ బహుమతి మెమంటో, జ్ఞాపిక,శాలువాతో పాటు 20000వేలునగదు బహుమతిని అందజేశారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గెలుపొందిన విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమానికి రజక సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థినిలు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థి ఇందు, గైడ్ టీచర్ అనిత, ధనుంజయలను ప్రధానోపాధ్యాయులు నరేష్, సర్పంచ్ తూము కృష్ణారెడ్డి, చైర్మన్ మరియమ్మ, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు.
🏠 Home